– ఆర్చరీలో శీతల్ దేవిపైనే అందరి దృష్టి
పారిస్: పారిస్ పారా ఒలింపిక్స్‌లో అందరి దృష్టి వీరిపైనే నెలకొంది. ముఖ్యంగా ఆర్చరీ విభాగంలో శీతల్ దేవిపైనే ప్రధానంగా నెలకొంది. 2022 ఆసియా పారా గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన శీతల్.. ఈ ఒలింపిక్స్‌లో పతకం దక్కడం ఖాయం కనబడుతోంది. రెండు చేతులు లేకపోయినా.. కాళ్ల సాయంతో బాణాలను నిర్ణీత గమ్యానికి చేర్చడంలో దిట్ట శీతల్ దేవి. ఆసియా పారా క్రీడల్లో ఆమె రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక రాజస్తాన్‌కు చెందిన అవని లఖేరా రైఫిల్ షూటింగ్ విభాగంలో, పురుషుల ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్, బ్యాడ్మింటన్‌లో కృష్ణ నగర్, పారా పిస్టల్ షూటింగ్‌తోపాటు 50మీ. మిక్స్‌డ్ పిస్టల్ ఎస్‌హెచ్‌్-1 విభాగంలో మనీష్ నర్వాల్ పతకాలు సాధించగల అథ్లెట్లు. వీరంతా 2020 టోక్యో పారా ఒలింపిక్స్, ఆసియా పారా క్రీడల్లో పతకాలు సాధించినవారే.