క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తా

– కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్
నవతెలంగాణ –  పెద్దవంగర
రాష్ట్రంలోని క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్, సెయింట్ పాల్ పాఠశాల అదినేత ఆనంద్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం ఫాస్టర్ ఫెలోషిప్ ను థామస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రైస్తవులు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, బీజేపీ లు క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. క్రైస్తవ సమాజానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.‌రాబోయే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.‌ ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆనంద్ కుమార్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మార్టిన్ లూతన్, రెవ, గడ్డం ప్రతాప్, జలగం జాషువా, దండుగుల సుధాకర్, ఎడ్ల వెంకటరత్నం, రడపొక ఆనందం తదితరులు పాల్గొన్నారు.