నవతెలంగాణ – జమ్మికుంట
తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు మరింత సేవ చేస్తానని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న-సదానందం తెలిపారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ లో న్యాయం చేస్తారని, నాపై నమ్మకం ఉంచి ఈ పదవీ బాధ్యతలు ఇచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా అద్యక్షుడు ఎమ్మెల్యే వ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం, గ్రేడ్ 2 కార్యదర్శి రాజా, మార్కేట్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.