ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

– విలేకరులతో బీజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కోహెడ
రానున్న ఎన్నికలలో నాకు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్ళపల్లి కిష్టస్వామి గుట్ట ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరులు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేసే వారి కుటుంబసబ్యులకు భరోసా కల్పించేందుకు ప్రతి విలేకరికి గ్రూప్‌ ఇన్స్‌రెన్స్‌ రూ.10 లక్షలు తన డబ్బులతో చేయిస్తానన్నారు. పార్టీకి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ప్రజలు ఇస్తే ప్రజలతో మమేకమై, అందరికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కార్యకర్తలు గ్రామగ్రామాన కార్యక్రమాలను ప్రజలలోకి చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, ప్రధానకార్యదర్శి పిల్లి నర్సయ్యగౌడ్‌, నాయకులు కంది సత్యనారాయణరెడ్డి, వివిధ పత్రికల విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.