వివాహమైతే విధుల నుంచి తొలగిస్తారా ?

– ఆ మిలటరీ నిబంధనలు లింగ వివక్ష, రాజ్యాంగ విరుద్ధమే : సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వివాహం చేసుకుంటున్నందుకు లేదా ఇంట్లో సమస్యలున్నందుకు మహిళా ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగించాలని కోరుతున్న నిబంధన లు ‘తీవ్రమైన లింగ వివక్ష’ కిందకు వస్తాయని, అవి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిం చింది. మహిళకు పెళ్లైందనే కారణంతో ఆమెను ఉద్యోగ ం నుండి తొలగించడం దారుణమైన లింగ వివక్షకు, అసమానతలకు నిదర్శనమని కోర్టు ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. ఇటువంటి పితృస్వా మ్య నిబంధనను ఆమోదించడం మానవ గౌరవాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. లింగ ప్రధానమైన పక్షపాతా ల ప్రాతిపదికన చట్టాలు, నిబంధ నలు రూపొందించడం రాజ్యాంగపరంగా అనుమతి యోగ్యం కాదని స్పష్టం చేసింది. మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో మహిళా పర్మినెంట్‌ కమిషనర్‌ ఆఫీసర్‌ హక్కులను పరిరక్షిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆమె వివాహం చేసుకుంటో ందన్న కారణంగా ఆమెను విధుల నుండి తొలగించారు. మాజీ లెఫ్టినెంట్‌ సెలీనా జాన్‌కు 8వారాల్లోగా పూర్తిగా 60లక్షల రూపాయిలను నష్టపరిహారంగా చెల్లించాలని జస్టిస్‌ సంజరు ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌ కేంద్రాన్ని ఆదేశించింది. ఆమెకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చిన సాయుధ బలగాల ట్రిబ్యులన్‌ లక్నో బెంచ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రం అప్పీల్‌ చేసింది. ఆమెను సర్వీసు నుండి తొలగించ డమనేది ‘తప్పు, అక్రమం’ అని స్పష్టం చేసింది.
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ల్లో మహిళలను సమానంగా చూడాలి
మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్‌ కమిషన్‌ను తిరస్కరించినందుకు కేంద్రం, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసిజి)లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళలను కూడా సమానంగా చూసేలా ఒక విధానాన్ని రూపొందించాలని కోస్ట్‌ గార్డ్‌ బలగాలను ఆదేశించింది. ఐసిజిలో అర్హత గల వుమెన్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లకు శాశ్వత నియామకాన్ని మంజూరు చేయాలని కోరుతూ మహిళా అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది.