– పుదుచ్చేరితో హైదరాబాద్ రంజీ పోరు
హైదరాబాద్ : ఎన్నో అంచనాలతో రంజీ ట్రోఫీ ఎలైట్ సమరానికి సిద్ధమైన హైదరాబాద్.. తొలి రెండు మ్యాచుల్లో దారుణంగా నిరాశపరిచింది. గుజరాత్, ఉత్తరాఖాండ్ చేతిలో పరాజయంతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. నేడు రంజీ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా పుదుచ్చేరితో హైదరాబాద్ తలపడనుంది. పుదుచ్చేరి రెండింట ఓ విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోవటం వైఫల్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కానీ రాహుల్ సింగ్, తన్మరు అగర్వాల్, రోహిత్ రాయుడులు అంచనాలను అందుకోవటం లేదు. హ్యాట్రిక్ పరాజయం ముంగిట నిలిచిన హైదరాబాద్ నేడు సొంతగడ్డపై పుంజుకుంటుందా? చూడాలి.