– జెయింట్స్‌తో సన్‌రైజర్స్ ఢీ నేడు
కేప్‌టౌన్ : సన్‌రైజర్స్ ప్రాంఛైజీ ఐపీఎల్‌లో నిరాశపరుస్తున్నా.. ఎస్‌ఏ20 లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. వరుసగా రెండో సీజన్‌లో ఈస్ట్రర్న్ కేప్ సన్‌రైజర్స్ జట్టు ఫైనల్లోకి చేరుకుంది. తొలి సీజన్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ తాజా సీజన్‌లో టైటిల్ నిలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో డర్బన్ సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. తొలి క్వాలిఫయర్‌లో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ అంతిమ పోరులో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఎస్‌ఏ20 ఫైనల్ ఆరంభం కానుంది.