నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 27 న జరగబోవు శాసన మండలి ఎన్నికలలో టీపీటీఎఫ్ బలపరుస్తున్న టీఎస్ యూటీఎఫ్ అభ్యర్ధి అలుగు బెల్లి నర్సిరెడ్డి ని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా మరోక మారు గెలిపించుకుందాం అని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కే. మాధవరెడ్డి ఉపాధ్యాయులను కోరారు.విద్యారంగ,ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలపట్ల,వాటి పరిష్కారం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తే కాక, 2019 నుండి శాసనమండలిలో ఉపాధ్యాయుల,అధ్యాపకుల గొంతుక గా నిరంతరం పని చేశారు అని అన్నారు.
ఆయన విజయం కాంక్షిస్తూ మంగళవారం అశ్వారావుపేట లో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించారు. శాస్త్రీయ దృక్ఫధం, నిజాయితీ, నిబద్ధత కలిగి విద్యారంగ,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం శ్రమించారు అని తెలిపారు. అందువలన సుదీర్ఘ పోరాట చరిష్మా కలిగిన ఫెడరేషన్ సంఘాల అభ్యర్థిని ఆదరించి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యతా ఓటును అలుగు బెల్లి నర్సిరెడ్డి కి వేసి మీయొక్క మొదటి ప్రాధాన్యత ఓటుతో అధిక మెజారిటీ తో గెలిపించాలని, తదనుగుణంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించుకోవాలని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను కోరారు.