
నవతెలంగాణ – భువనగిరి
ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తను గెలిపించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు వరంగల్ -నల్గొండ -ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్థానిక పెన్షనర్స్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం విద్యా పరిరక్షణ కోసం కృషిచేయడం జరిగిందని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగములో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, గురుకుల,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, కెజిబివి ఉపాధ్యాయులకు సమ్మె కాలం వేతనం ఇవ్వాలని, కనీస స్కేల్ ను అమలు చేయాలన్నారు. వారి సర్వీస్ ను రెగ్యులర్ చేయాలనీ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తాన్ని పాఠశాలల్లో కళాశాలలో అవసరమైన భవనాలు ప్రహరీల్లా నిర్మాణానికి కేటాయించాలని తెలిపారు. పేద ప్రజలకు వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు .
సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో 2021 జులై 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు నల్గొండ నుండి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేసి సమస్యల తీవ్రతను ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశానన్నారు. శాస్త్రీయ దృక్పథం నిజాయితీ, నిబద్ధత, అవగాహనతో విద్యారంగా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు . విద్యారంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యల పట్ల నిర్వహించిన ఉద్యమాలకు పోరాటాలకు తన మద్దతు తెలిపానని వివరించారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లక్షల రెగ్యులరైజేషన్ సాధించడంలో తను అత్యంత కీలకమైన పాత్ర పోషించానన్నారు ప్రభుత్వ రంగం బలపడాలని తపించే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు
మద్దతు…
మోడల్ స్కూల్ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మోడల్ స్కూల్ తరఫున మద్దతు తెలుపుతున్నట్లు మోడల్ స్కూల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిల్వర్ మహేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు, జిల్లా కార్యదర్సులు జి వి రమణా రావు, జి. బాలయ్య, పి సుదర్శన్ రెడ్డి, సంగు వనిత, కె వెంకన్న, ఐ. సంజీవ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కె. గోపాల్, నాగరాజు పాల్గొన్నారు.