
నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని మునిగేల వీడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎన్టిపిసి ఆర్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ కాంపిటీషన్ లో ప్రతిభగనపరిచి జాతీయస్థాయి పోటీలకు భీమ్లా తండాకు చెందిన బానోతు ఆనంద్ కు మొదటి 50వేల రూపాయలను పొంది అదే పాఠశాలకు చెందిన బొలికొండ ధనుష్ కుమార్కు ప్రత్యేక బహుమతిగా 7500 నగదును దక్కించుకున్నారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న తెలిపారు. శుక్రవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆ పాఠశాల బృందం అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచి ఎన్టీపీసీ వారి నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో ప్రథమ స్థానం దక్కించుకోవడానికి కృషిచేసిన ఆ పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయుడు దొరపల్లి రాజేష్ లను అభినందించారని అన్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు వీటిని కైవసం చేసుకోవడం పట్ల వారిని అభినందించి పాఠశాలలకు మంచి పేరు తీసుకు వచ్చినందుకు వారి పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం తెలియజేస్తున్నారని అన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయికి డ్రాయింగ్ పోటీలలో ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మొదటి బహుమతి పొందిన విద్యార్థి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు డిసెంబర్‌లో వెళ్ళనట్లు ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె రామ్మోహన్ రెడ్డి, గండి సత్యనారాయణ, సుదర్శన్, మోహన్ ఆచారి, రామస్వామి, పి నాగరాజు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.