బీఆర్ఎస్ అభ్యర్థి కవితను గెలిపించండి.. 

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి 

నవతెలంగాణ – నెల్లికుదురు 
బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవితను ప్రతి ఒక్కరు గెలిపించేందుకు కృషి చేయాలని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ప్రధాన కార్యదర్శి వేన్నాకుల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు పులి రామచంద్రు ఆ పార్టీ జిల్లా నాయకుడు నల్లని నవీన్ రావు మండల కేంద్రం తో పాటు కాచికల్ బడి తండా సీతారాంపురం గ్రామాలలో శుక్రవారం ఎంపీ అభ్యర్థి కవితా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి  కవిత గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా ఉంటూ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంతోమందికి ఉపాధి కలిగించి పేదలను ఆదుకున్న ఘనత కేవలం ఆమెకే దక్కిందని అన్నారు. కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఆమెకు దక్కిందని అన్నారు ఎవరికి ఆపద వచ్చినా వెంటనే వచ్చి వారి సమస్యలు అడిగి పరిష్కారాన్ని దిశగా ముందుకు సాగిందని అన్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ అవకాశం ఎంపీగా వచ్చినందున ఆమె కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
సీతారాంపురం గ్రామాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే 
సీతారాంపురం గ్రామం అభివృద్ధి చెందిందంటే ఆది కేవలం బీఆర్ ఎస్ పార్టీ వల్లనే ఈ గ్రామం అభివృద్ధి చెందిందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ జిల్లా నాయకుడు నవీన్ రావు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని సీతారాంపురం గ్రామం ఒక మారుమూల గ్రామంలో ఉండి రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఎంతో మంది పాలకులను వేడుకున్న కూడా ఈ గ్రామ అభివృద్ధి చెందలేదని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హాయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ మాలోతు కవితను గ్రామస్తులు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కావాలని కోరిన వెంటనే కోట్లాది రూపాయలు కేటాయించి వెంటనే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత కేవలం బీఆర్.ఎస్ పార్టీ దేని అన్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి వారు విద్య వైద్య వ్యవసాయ రంగానికి మండల కేంద్రం చేరుకోవాలని ఎంతో ఇబ్బందులు పడేవారని అలాంటి సమస్య లేకుండా కేవలం బి ఆర్ ఎస్ పార్టీ మాత్రం చేసిందని అన్నారు. అందుకోసం ఈ గ్రామస్తులు మూకుమ్మడిగ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోనటు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు పట్టణ శాఖ అధ్యక్షుడు ఆదిరెడ్డి బడి తండ అధ్యక్షుడు వీరన్న సీతారాంపురం గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం నాయకులు దేవేందర్ రావు లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి బత్తిని అనిల్ గౌడ్ కందగట్ల వెంకన్న రాపాక వీరభద్ర యాదవ్ నక్క సాయిలు బొడ్గం బిక్షం రెడ్డి అశ్విని ఎండి రహిమాన్ కారం ప్రశాంత్ సల్గు శ్రీనివాస్  శ్రీనివాస్ బొల్లు మురళి తదితరులు పాల్గొన్నారు.