– సీపీఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్యలు పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ పట్టణంలో దారుషాఫా కాలనీ, అర్జాలబావిలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో ప్రధాన రెండు రహదారులు వెడల్పు చేసి వేలాదిమంది ఉపాధిని పోగొట్టి అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రైతు నాయకుడిగా నిరంతరం పోరాటాలు చేస్తున్న ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, కుంభం కష్ణారెడ్డి, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, మారగోని నగేష్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, పాలది కార్తీక్, కాసర్ల గౌతంరెడ్డి, కర్నాటి శ్రీరంగం, రేఖల సుగుణమ్మ,సాత్విక్, తదితరులు పాల్గొన్నారు.