
నవతెలంగాణ – వలిగొండ రూరల్
రాజకీయ పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రోజున గోల్నే పల్లి గ్రామంలో సీపీఐ(ఎం)ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఐ(ఎం) అభ్యర్థికి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు. మిగతా పార్టీల నాయకులు ఇప్పటి వరకు ప్రజలకోసం ఎన్ని పోరాటాలు నడిపారో చెప్పాలన్నారు, ఎన్నికలప్పుడు వచ్చి వేల కోట్ల రూపాయల కుమ్మరించి పదవులను కొనుగోలు చేసే అవకాశవాద స్వార్థపర శక్తులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలను కొనుగోలు చేయాలని దుర్మార్గపు ఆలోచనతో రాజకీయాలు నడపడం రాజ్యాంగ వ్యతిరేకమని కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తారని, అలాంటి కమ్యూనిస్టులకు తప్పనిసరిగా ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్కురి రామచందర్, మండల నాయకులు వేముల నాగరాజు, నాయకులు గంగాపురం వెంకటేశం,వేముల జ్యోతి బస్,కల్కురి లక్ష్మమ్మ, నర్సింహ,సాగర్ తదితరులు పాల్గొన్నారు