
గత 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తున్న కొండమడుగు నర్సింహ ను భువనగిరి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి లు అన్నారు. భువనగిరి నియోజకవర్గ సిపిఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ గెలుపును కోరుతూ పహిల్వాన్ పురం గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై వ్యవసాయ కూలీల సమస్యలపై, రైతుల సమస్యలపై దళితుల సమస్యలపై పోరాడుతున్న కొండమడుగు నరసింహ భువనగిరి నియోజకవర్గం నుండి సిపిఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయనకు ఓటు వేసి గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) శాఖ సహాయ కార్యదర్శి రాగిరు కృష్ణస్వామి, నాయకులు రేపాక ముత్యాలు, బంధారపు ధనంజయ, వీరస్వామి, వట్టిపల్లి చంద్రయ్య, వనగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.