
బీఆర్ ఎస్ పార్టీ బలపరచిన ఎమ్మెల్సీ,అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని నల్లగొండ వరంగల్,ఖమ్మం,జిల్లాల పట్టభ ద్రులను,కోరిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతుడు బిట్స్ పీలాని లో గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి అని, ఇటువంటి చదువుకున్న వ్యక్తి చట్ట సభల్లోకి వస్తే.విద్యార్థుల విద్యావంతుల,ప్రభుత్వ ప్రయివేట్,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాడని అన్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న కళాశాల ల ఫీజు రియాంబర్స్్మెంట్ విడుదల చేయిస్తాడని ప్రభుత్వం తో కొట్లాడి.నిరుద్యోగులకు ప్రభుత్వ,ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయిస్తాడని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి వచ్చే విధంగా కృషి చేస్తాడని తెలిపారు.రాకే ష్ రెడ్డి ని గెలిపిస్తే తనకు నెల వారి వచ్చే జీతం.మొత్తం విద్యార్థుల కోసం ఖర్చు పెడతాడని కోచింగ్ సెంటర్ లలో నిరుద్యోగుల కొరకు,ఉచిత విద్యను అమలు చేస్తాడని అన్నారు. పై వన్ని సాధ్యం కావాలంటే చదువు కున్న విద్యావంతులు ప్రయివేట్ మరియు గవర్న మెంట్ రంగాలలో మరియు ఇతర రంగాలలో పని చేసే పట్ట భద్రులు,ఆలోచించి ఈనెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3వ సీరియల్ నెంబర్ పై 1వ ప్రాధాన్యత ఓట్లు వేసి భారీ మెజారిటీ తో రాకేష్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.