నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించండి

– పట్టణంలోని ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు 

నవతెలంగాణ – అచ్చంపేట 
నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యునిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని ప్రజలకు ఓటర్లకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విజ్ఞప్తి చేశారు. శనివారం పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్యారెంటీల పథకాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతినెల కుటుంబంలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సపల్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు తగురం శీను, రమేష్ రావు, నాయకులు సుంకరి బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ అశోక్ తదితరులు ఉన్నారు.