వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట విస్తృత కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి 

నవతెలంగాణ – ధర్మసాగర్
మార్చి 3.4 తేదీలలో రెండు రోజుల పాటు హనుమకొండలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని బికే ఎం యు సభ్యులు మదేల ఎల్లేష్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బి కే ఎం యు కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాస్తు,ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఉపాధి అవకాశాలను నిర్వీర్యం  చేసి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.గ్రామాల్లో యువతకు ఉసాధి లేకుండా విద్యావంతులైన యువతీ యువకులు ఉపాధి హామీ పనులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి. ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.అందులో భాగంగానే పేద వర్గాలకు  ఉపాధి హామీ పథకంపై అవినీతి ముద్ర వేసి పోరాడి సాధించుకున్న పథకాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందన్నారు. ప్రతి బడ్జెట్ కేటాయింపులలో కోతలు పెడుతున్నదని, పెండింగ్ బిల్లుల చెల్లింపులలో జాప్యం చేస్తున్నదన్నారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కాలరాసే విధంగా అశాస్త్రీయ పద్ధతులలో కొత్త నిబంధనలు తెచ్చి పేదలకు ఉపాధి హామీ పములను దూరం చేసే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.పనిచేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూలీల ఫోటోలను దించి అప్లోడ్ చేసే పద్దతిని తీసుకువచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచవలసిన అవసరం ఉందని 8-00 గంటలకు పైగా పనిచేసిన కూలీలకు 258/- రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, కూలీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పట్టణ పేదలకు కూడ ఉపాధి హామీ పనులకు కల్పించి, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్చి 3.4 తేదీలలో రెండు రోజుల పాటు హనుమకొండలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల జయప్రదాన్ని ఆకాంక్షిస్తూ, ఈ సభకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించి వ్యవసాయ కార్మికుల పక్షాన నిలవాలని కోరారు.పెరియార్ స్వామి, మాజీ శాసన సభ్యులు  బి కే ఎం యు కూనంనేని సాంబశివరావు,శాసన సభ్యులు బి కే ఎం యు రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్ఛి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు యన్. బాలమల్లేష్, బి కే ఎం యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలకొండ కాంతయ్య, బి కే ఎం యు రాష్ట్ర అధ్యక్షులు కర్రె భిక్షపతి, సిపిఐ జిల్లా కార్యదర్శి, హనుమకొండ సమావేశంలో ముఖ్య అతిథులుగా  పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో. బట్టు మల్లయ్య కొట్టే ప్రభాకర్ మునిగాల బిక్షపతి కొట్టే వెంకటేష్ కొమురయ్య మర్రిపల్లి అంకుష్ తదితరులు పాల్గొన్నారు.