నవతెలంగాణ – మద్నూర్
మొహమ్మద్ ఆబ్బూ మాట్లాడుతూ జుక్కల్ గౌరవ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు ప్రకటించిన యూత్ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తూ కోరారు. జుక్కల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న ఇమ్రోస్, అలాగే మండల అధ్యక్షులుగా పోటీ చేస్తున్న జుక్కల్ మండల సతీష్, మద్నూర్ మండలం హనుమంత్ యాదవ్, బిచ్కుంద మండలం అనిల్ పటేల్ ,పెద్ద కొడపగల్ మండలం శ్రీనివాస్, శాసనసభ్యులు లక్ష్మీ కాంతారావు యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడం పోటీలో ఉన్న వారిని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గెలిపించాలని సూచించారు. జుక్కల్ శాసనసభ్యునిగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ నిరంతరం ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు కొరకే తన జీవితం అంకిత భావంతో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు ఎన్నికలకు పోటీలో దింపిన నాయకులు పార్టీ శ్రేయస్సు కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులను నియమించినందుకు ప్రతి మండలంలో నాయకులకు భారీ మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ యువకులను కోరారు.