– కేసీఆర్ భరోసా
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: ఎల్లగిరి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లగిరి సర్పంచ్ రిక్కల ఇందిరసత్తిరెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి ప్రదాత ఉప ఎన్నికల్లో సంచలనం సృష్టించి విజయకేతనం ఎగురవేసిన మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరొకసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందని రిక్కల ఇందిరసత్తిరెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని వాడవాడ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు యాదవ్, మండల నాయకులు రిక్కల భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కందగట్ల పద్మా రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు రిక్కల బాలకృష్ణారెడ్డి, కందగట్ల వెంకట్ రెడ్డి, పెద్దిరాజు, మధుసూదన్ రెడ్డి,బాలరాజు,కొత్త శ్రీశైలం, మేకల పద్మ తదితరులు ఉన్నారు.