నవతెలంగాణ – గోవిందరావుపేట
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల చిట్టిబాబు పిలుపునిచ్చారు. బుధవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25 నుండి 28 వరకు తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో రైతులు కూలీలు నిరుద్యోగులు పేదలు అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మహాసభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ , తీగల ఆగిరెడ్డి, పసర గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు, మండల కమిటీ సభ్యులు ముమ్మడి ఉపేంద్రచారి, కందుల రాజేశ్వరి, మంచాల కవిత, గ్రామ నాయకులు చిన్నపల్లి అశోక్, పాసికంటి గణేష్. సామ మహేష్ కడారి అశోక్, తదితరులు పాల్గొన్నారు.