నవతెలంగాణ-సంగారెడ్డి
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో కార్మిక సంఘాల సమావేశాన్ని మంగళవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు రాజేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ పదేండ్ల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారు లకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్‌ను తెచ్చిందని మండిపడ్డారు. పెట్టుబ డిదారులకు అనుకూల నిర్ణయాలు చేస్తూ హక్కుల మీద దాడి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా ధరలు విపరీతంగా పెంచిం దన్నారు. ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని మోడీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రవ ుంలో వెంకట్రాజ్యం, సుందర్, యాదగిరి ,లక్ష్మయ్య ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.