దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

– అంగన్వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ పార్వతమ్మ 
నవతెలంగాణ –  అచ్చంపేట
ఈనెల 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అంగన్వాడి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ పార్వతమ్మ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీడీపీఓ ఆఫీసు లో జూనియర్ అసిస్టెంట్ నీలమ్మకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈనెల 16వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అంగన్వాడి ఉద్యోగులు కూడా పాల్గొంటారని , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం  హక్కులను కారరాస్తున్నది అని అన్నారు.  కనీస వేతనం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందనీ,  కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు,  టీచర్ కు 5 లక్షల రూపాయలు,  ఆయాకు ఇవ్వాలని అన్నారు.  పీఎఫ్,  ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల పైన పనిబారం తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి హామీని 10 సంవత్సరాల కాలంలో నెరవేర్చలేదని అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు భారతి, కవిత , బుషీర , జ్యోతి,  తదితరులు పాల్గొన్నారు.