కోట్లు ఉన్నోడిని కాదు.. పార్లమెంట్లో  కొట్లాడే వాడిని గెలిపించండి

– భువనగిరి బీఎస్పీ  పార్టీ అభ్యర్థి ఐత రాజు అంబెందర్ 
నవతెలంగాణ – చండూరు
ఈనెల 13న జరిగే  భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కోట్లు రూపాయల  సొమ్మున అభ్యర్థులను కాకుండా   బడుగు బలహీన వర్గాల  తరపున  పార్లమెంట్లో  కొట్లాడే  బి ఎస్ పి  పార్టీ   అభ్యర్థి ని గెలిపించాలని భువనగిరి బిఎస్పి  పార్టీ అభ్యర్థి ఐత రాజు  అంబెందర్ ఓటర్లను కోరారు.   సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కోట్ల రూపాయల అక్రమాస్తులతో ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ అడుగు బలహీన వర్గాలకు చెందిన నన్ను ఆశీర్వదించాలని కోరారు. హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్న పార్లమెంటు అభివృద్ధికి దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అగ్రకులాలకు చెందిన వారిని గెలిపిస్తున్నామని వారికి బడుగు బలహీన వర్గాలు ఓటు బ్యాంకు గా కాకుండా రాజ్యాధికార కోసం ప్రయత్నించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కు వచ్చినప్పుడు నుండి కాలయాపుట తప్ప చేసిందేమీ లేదన్నారు.  రైతులకు రుణమాఫీ లేదు బోనస్ లేదన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.  హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓడించాలని ప్రజలను బిజెపి పార్టీ అభ్యర్థి విషయాన్ని చెప్పుకుంటుండు గాని అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు  రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపిలకు తగిన బుద్ధి చెప్పి బి ఎస్ పి పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జి  నేరెళ్ల ప్రభుదాస్, కోశాధికారి కత్తుల పరమేష్, మహిళ కన్వీనర్  అమ్మురోజు  గీతా గణేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు అనేపాక శంకర్ దుబ్బాక ఉపేందర్, చింతా శివ తదితరులు పాల్గొన్నారు.