పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి: ఢిల్లీలో మీ గళం అవుతా..

– మాల సోదరుల ఆత్మీయ సమ్మేళన సభలో పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అచ్చంపేట 
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించండి మీ సమస్యలపై ఢిల్లీలో మీ గళం అవుతానని పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అమ్రాబాద్ మండల కేంద్రంలో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్  అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు.ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే వారికి తోడుగా ఉంటున్నానని, ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిగా మీ అందరి అభిమానాలు ఉండాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. మన అందరి ముందుకు పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎన్నికల ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి , సోషల్ మీడియా సమన్వయకర్త అభిలాష్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు చెన్నకేశవులు, పదర జడ్పిటిసి రాంబాబు నాయక్, నాయకులు వెంకటేష్, రాంచందర్, శంకర్ మాదిగ, శ్రీను, మల్లేష్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.