పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి..

– న్యాయవాదులను అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్..
నవతెలంగాణ – వేములవాడ 
పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి అని  న్యాయవాదులను అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్..2025 మార్చి నెలలో జరిగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మంగళవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను కలిసి ఓటు అభ్యర్థించిన ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయానని  తెలిపారు.పట్టభద్రుల హక్కులకై మండలిలో పోరాడుతానని, న్యాయవాదిని అయిన నన్ను గెలిపించాలని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, విద్యాసాగర్ రావు, కొడిమ్యాల పురుషోత్తం, పెంట రాజ్ కుమార్, కందుల క్రాంతి కుమార్,శ్రీనివాస్ , కటకం జనార్ధన్, బొడ్డు గంగరాజు, బొజ్జ మహేందర్, గుడిసె సుదర్శన్ ,బొజ్జ నరేష్, సాగరం శ్రీధర్ తో పాటు  తదితరులున్నారు.