నల్గొండలో జరిగే రైతు మహా ధర్నాను జయప్రదం చేయండి..

Victory in Rythu Maha Dharna in Nalgonda..నవతెలంగాణ – పెద్దవూర
నేడు బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాను జయప్రదం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్ పార్టీ శ్రేణులకు పిలువు నిచ్చారు. సోమవారం మండల కేంద్రం లో మాట్లాడుతూ నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు, కేటీఆర్ మహాధర్మా కార్యక్రమాన్ని కి విచ్చేయుచున్న సందర్భంగా మండలం నుండి అత్యధిక సంఖ్యలో ప్రతి గ్రామపంచాయతీ నుండి రైతులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని. తెలిపారు రైతు వ్యతిరేక, కాంగ్రెస్ పాలను గద్దెదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు రమావత్ హరినాయక్,మండల నాయకులు జిల్లా కొండలు, మండల నాయకులు శంకర్,మండల యువ నాయకులు జటావత్ రాజశేఖర్,అశోక్ నాయక్, తరి వెంకన్న, సీనియర్ నాయకులు మంజి తదితరులు పాల్గొన్నారు.