సమ్మెను జయప్రదం చేయండి..

– దాసరి పాండు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు.. 
నవతెలంగాణ  – భువనగిరి
 ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. గురువారం  భువనగిరిలోని  సుందరయ్య భవనంలో భువనగిరి పట్టణ మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల ముఖ్య సమావేశం కొండయ్య అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు  సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వర్గం మీద దాడి చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు వారి ప్రయోజనాల కోసం సంపదను కట్టబెడుతున్నారని విమర్శించారు. పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికి ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఉన్న చట్టాలను తీసేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేకించాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు చెప్పడానికి చూస్తూ కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని వారు అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు  జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ నాయకులు యాదగిరి, నరసింహ, సుదర్శన్, సంతోష్, ఐలయ్య, గణేష్ పాల్గొన్నారు.