– భారీగా పెరిగిన గులాబీ రేట్లు
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో పూలకు డిమాండ్ పెరిగింది. కిలోకు 60 రూపాయల వరకు పలికిన ఓపెన్ గులాబీ పూలు ఎన్నికల తరుణంలో ప్రస్తుతం రూ.100 దాటింది. అలాగే మరికొన్ని పూలు కిలోకు రూ.150 రూ.200కు చేరాయి. ఎన్నికల ప్రచారాల కోసం ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పూలను అధికంగా వాడటమే ఇందుకు కారణం. వ్యాపా రులు ప్రస్తుతం రోజంతా మార్కెట్లోనే ఉంటున్నారు. ఎన్నికల వేళ వ్యాపారం బాగా జరుగుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గులాబీతోపాటు బంతి, చామంతి, ఇతర పూలకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్, గుడిమల్కాపూర్, కుషాయిగూడ, మెహిదిపట్నం, మోండా, ఎర్రగడ్డ మార్కెట్లో పూలు జోరుగా విక్రయిస్తున్నారు.