గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

– విద్యార్థులకు నియామక పత్రాల అందజేత
– స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులకు రూ.5.18 లక్షల సగటు వార్షిక వేతనం
– సెలిగో, పెగా సిస్టమ్స్‌ రూ.15 లక్షల గరిష్ట వార్షిక వేతనం
– ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.14.13 లక్షల వార్షిక వేతనం
నవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ శుక్రవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్‌ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్‌, మేనేజ్‌ మెంట్‌, ఫార్మశీ, సైన్స్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విద్యార్థులకు నియా మక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిం చడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అంద జేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 180 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌ గీతమ్‌ లో ప్రాంగణ నియా మకాలను నిర్వహించగా, ఇప్పటినరకు 150 కంపెనీలు బీటెక్‌, ఎంటెక్‌, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ.ఫార్మశీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. కొంతమంది విద్యా‌ర్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని దేశ, విదేశాలల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశార్హత సాధించినట్టు తెలియజేశారు. ఇప్పటివరకు అత్యధిక విద్యా ర్థులు ఐటీ సేవలతో పాటు పలు బహుళజాతి కంపెనీలు, ఫార్మాన్యూటికల్‌ పరిశ్రమలలో ఉద్యోగాలు పొందినట్టు చెప్పారు. టెక్నాలజీ విద్యార్థులు రూ.15 లక్షల గరిష్ట, వార్షిక వేతనం, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు రూ.14.13 లక్షలు, సెర్చ్‌ విద్యార్థులు రూ.7.5 లక్షల చొప్పున గరిష్ట, వార్షిక వేతనాలకు ఎంపికెనట్టు తెలిపారు. మొత్తంమీద గీతం మేనే జ్మెంట్‌ విద్యార్థులు రూ.7.5 లక్షలు, టెక్నాలజీ విద్యా ర్థులు రూ.5.18 లక్షల సగటు వార్షిక వేతనాన్ని పొందినట్టు తెలిపారు. బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థిని రీతి దత్తా చౌదరి ఐఐటీ జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జేఏఎం-2024)లో 333వ ర్యాంకు సాధించి.. జాతీయ స్థాయిలో గీతం విద్యార్థుల విద్యా ప్రతిభ, సామర్థ్యా లను చాటిచెప్పింది. అనేకమంది విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీలలో ఇంటర్న్‌ షిప్లు పొందడమే గాక, తద్వారా మంచి ప్యాకేజీలతో పోస్ట్‌-ఇంటర్న్స్‌ నియా మకాలు పొందినట్టు తెలిపారు. ఓ విద్యార్థి మెక్రోసాఫ్ట్‌ ఇంట ర్న్‌షిప్‌లకు ఎంపికై మొదట్లో రూ.1.25 లక్షల సీటీసీని పొందగా, ఇంటర్ప్రైస్‌ విజయవంతంగా పూర్తj ూ్యక రూ.50 లక్షల సీటీసీ పొందనున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థులు రూ.50 వేలతో ఇంటర్న్‌ షిప్‌ పొంది, అది పూర్తయ్యాక వారి వార్షిక నేతనం రూ.25 లక్షలకు పెరుగు తుందన్నారు. సెలిగో, పెగా సిస్టమ్స్‌ రూ.15 లక్షల వార్షిక వేతనం, ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.14.12 లక్షలు, బాలెంట్‌ సర్వ్‌ రూ.12 లక్షలు, స్టోరబుల్‌ ఇండియా రూ.11 లక్షలు, ఇవే కాకుండా మరిన్ని సంస్థలు మంచి వార్షిక వేతనాలను గీతం విద్యార్థులకు ఆఫర్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆచ్చీవర్స్‌ డేకి అతిథులుగా యాక్సెంచర్‌ టాలెంట్‌ అక్విజిషన్‌ ఉపాధ్యక్షుడు అమిత్‌ సిన్హా, ఎంపీహెచ్‌ఎఎస్‌ఎస్‌ ఇండియా క్యాంపస్‌ లీడ్‌ జాషువా డేవిడ్‌, అరబిందో ఫార్మా అసోసియేట్‌ వైస్‌ ప్రెసి డెంట్‌ అర్జుమన్‌ శరణ్‌, ఆర్‌ఎకే సెరామిక్స్‌ కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ టి.నీరజ్‌ కుమార్‌, ఎల్‌అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌ శ్రీనివాసరావు పట్నాల పాల్గొ న్నారు. తొలుత, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అద్వితీ యమైన కషి చేస్తున్న అధ్యాపకులను గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌, కోర్‌ ఇంజనీరింగ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ వీ.ఆర్‌.శాస్త్రి అభినందించారు. గీతం కెరీర్‌ గైడెన్స్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ నాతి వేణుకుమార్‌ స్వాగతోసన్యాసం చేయ గా, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.త్రినాథరావు నందన సమర్పణ చేశారు. ఈ కార్యక్ర మంలో స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసోసియేట్‌ డైరెక్టర్‌ ప్రొఫె సర్‌ ఎన్‌.సీతారామయ్య, పలువురు ప్రిన్సిపాళ్ళు, డైరెక్టర్లు- ప్రొఫెసర్‌ జి.శివకుమార్‌, డాక్టర్‌ మోతహర్‌ రెజా, డాక్టర్‌ బందన్‌ కుమార్‌ మిశ్రా, వివిధ విభాగాధిపతులు, అధ్యాప కులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.