
ఈరోజు భీంగల్ కేంద్రంలోని కృషి పబ్లిక్ హైస్కూల్ గ్రౌండ్ లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కీర్తిశేషులు ముత్యాల సామాన్వి స్మారక క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నిర్వహించడం జరిగింది. క్రీడలలో సత్తా చాటిన టీం లకి ఈరోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా, ఫైనల్ మ్యాచ్లో భీంగల్ 11 టీం విన్నర్ గా మరియు బాబాపూర్ టీం రన్నర్ గా, తృతీయ బహుమతి శ్రీరామ్ యూత్ గెలవడం జరిగింది. క్రీడలలో సత్తా చాటి గెలిచిన క్రీడాకారులకు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కర్నే సురేందర్ ప్రేమలత మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు వక మహేష్ స్థానిక వ్యాపారవేత్త జొన్నల భూపాల్, మహేష్, స్థానిక సీనియర్ క్రికెటర్ రాజేశ్వర్,సురేందర్, మధు,మేనేజ్మెంట్ ఆర్గనైజర్ రేహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.