
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న క్రీడా పోటీలలో ఆదివారం నిజామాబాద్ జిల్లా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు వేణురాజ్ పాల్గొన్నారు. యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ ఎస్ యుఐ 53 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనివర్సిటీలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న యూనివర్సిటీ అధ్యక్షులకు, కమిటీకి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జీవితంలో, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, క్రీడలు అనేవి సోదరభావంతో ఆడాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ప్రధానమైనవని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్ల పాటు బిఅర్ఎస్ ప్రభుత్వం విద్య వ్యవస్థను నాశనం చేసిందని, ఇదే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసే దిశగా తమ కార్యచరణను ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు కోమిర శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ రెడ్డి, కమిటీ సభ్యులు సాగర్ నాయక్, రాజేందర్ ,మహేష్ కుమార్, నిరంజన్, విజయ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.