ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం..

– నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను.
– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని,నియోజ కవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం మండ లంలోని గుడి కందుల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పద్మా రెడ్డి తో పాటు మరో 30 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో  ఓడిపోయిన నియోజకవర్గ అభివృద్ధి కోసం అహ ర్నిశలు కృషి చేస్తానని అన్నారు.ఎన్నికల హామీల లో బాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ లు అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు.ఈ నెల 28 తేదీ నుండి గ్రామ సభలు ప్రారంబమవుతాయన్నారు.గ్రామ సభల లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు తోడ్పడాల ని పిలుపు నిచ్చారు.అంతకు ముందు పార్టీలో చేరిన సూకూరు అశోక్, కోళ్ల పద్మా రెడ్డి, ఆకునురి కనకే, సూకూరు యాదయ్య తదితరులకు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి,ఫిషర్ మెన్ కాంగ్రె స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముది రాజ్,జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్,మాజీ సర్పంచ్ కొంగరి నర్సింలు,పులి రోజు నరసవ్వ, రమేష్,రవి,శ్రీకాంత్, నాగరాజు, రాములు, విజయేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.