ఆటల్లో గెలుపు ఓటములు సహజం: జీల్లెల రమేష్

నవతెలంగాణ – వీర్నపల్లి
ఆటల్లో గెలుపు ఓటములు సహజమని ఎస్సై జీల్లెల రమేష్ అన్నారు. వీర్నపల్లి మండలం మాడల్ స్కూల్ లో దోస్త్ మీట్ 2024 క్రీడ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఆటల్లో కబడ్డీ విభాగం లో మద్దిమల్ల ప్రథమం , వీర్నపల్లి ద్వితీయ స్థానం, వాలి బాల్ విభాగం లో వీర్నపల్లి ప్రథమ స్థానం, అడవి పదిర ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ యువత గంజాయి మత్తు వంటి చెడు వ్యసనాలకు దురంగా ఉండాలి, క్రమశిక్షణ గా ప్రవర్తించి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆటలతో ఆరోగ్యం స్నేహాభావం క్రమశిక్షణ కి దోహదపడ్తాయని క్రీడ కారులకు సూచించారు. క్రీడా కారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్సై రాజిరెడ్డి, పిడి ప్రతాప్ కుమార్, సాయి కృష్ణ, అజయ్, రాకేష్, కానిస్టేబుల్ బాబు, కార్తిక్, నయీం పాషా, మండల యూత్ నాయకులు తిరుపతి, నరేష్, అజయ్, క్రీడ కారులు తదితరులు పాల్గొన్నారు.