క్రీడల్లో గెలుపోటములు సహజం..

– స్కూల్ గేమ్స్ నిర్వహణా కోసం మండలానికి 50వేలు ఇవ్వాలని నిర్ణయం..
– జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు,నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఏదైనా క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచిన ఓడిన నిరుస్తా పడకుండా రాబోయే పోటీల్లో తమరు దాగి ఉన్న సత్తను నిరూపించుకొని గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని, జిల్లాలోని ప్రతి మండలానికి స్కూల్ గేమ్స్ నిర్వహణ కోసం 50 వేల రూపాయలను అందజేసే విధంగా ఒలంపిక్ కమిటీలు నిర్ణయించి కలెక్టర్ కు కమిటీ తీర్మానాన్ని అందజేయడం జరుగుతుందని,అనీదులు వస్తే నిర్వహణకు ఇబ్బందులు ఉండవని జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షులు, నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 67 వ ఎస్ జి ఎఫ్ మండల స్థాయి 10నుండి 13వరకు జరిగే  క్రీడా పోటీలను ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి స్కూల్ గేమ్స్ నిర్వహణ కోసం కలెక్టర్ నీదుల నుండే కాకుండా ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకుని వెళ్లి మండల స్థాయి క్రీడా పోటీలకు నిధులను కేటాయించే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా ఒలంపిక్ కమిటీలో నిధులు లేవని నీదులు వచ్చిన క్రీడా పోటీలకే వేచ్చించడం జరుగుతుందన్నారు. ముగింపు క్రీడా పోటీలకు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వస్తున్నాట్లు ఈగ సంజీవ్ రెడ్డి ప్రకటించారు. అంతకుముందు క్రీడా కురులకు పరిచయ కార్యక్రమం అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. వాలీబాల్ ఆడుతూ ఫోటోలు ప్రారంభించారు. మార్చ్ ఫాస్ట్ చేసిన ఇందల్ వాయి కి మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి నల్లవెల్లి కి, తృతీయ బహుమతి ఎల్లారెడ్డి పల్లి పాఠశాలలకు బహుమతులను ప్రదానం చేశారు. సంసృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో పిఆర్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి,వెంకటేశ్వర్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్, సర్పంచ్ పాశం సత్తేవ్వ నర్సింలు, ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, పాఠశాల చైర్మన్ నమాల గంగాధర్, బిఅర్ఎస్ రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశం కుమార్, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, లోకాని గంగారాం, మోచ్చ గోపాల్, డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలల పిఈటీ లు, అధ్యాపకులు గ్రామస్తులు,విడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.