క్రీడలలో గెలుపోటములు సహజం…

– ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు 
– రాఘవరెడ్డి, అల్లం బాలకిషోర్ రెడ్డికి ఘనంగా సన్మానం….
నవతెలంగాణ-గీసుగొండ : క్రీడలలో గెలుపోటములు సహజమని ఓటమితోనే గెలుపు సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు.
గెలుపొందిన జట్లకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడారు…ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలకు రాణించి చదువుకున్న పాఠశాలకు కన్న తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం క్రీడల పట్ల సదుద్దేశంతో ఉందని ఆయన అన్నారు. 50 ఎకరాల్లో స్పోర్ట్స్ జోన్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖో ఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రముఖ సామాజికవేత్త అల్లం బాలకిశోర్రెడ్డి, వెంకట్రెడ్డి, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మినారాయణ, ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ కన్వీనర్ వీరగోని రాజ్కుమార్, వరంగల్ ఒలంపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాస్యాదవ్, హెచ్ఎం పట్టాభి, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్, ఏనుగుల సాంబరెడ్డి, దూపాకి సంతోష్, పీఈటీలు కోట రాంబాబు, స్వప్న, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు..
మండలంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న  రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా శనివారం  ముగిసాయి.
పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి వరంగల్ జట్టు కైవసం చేసుకోగా..ద్వితీయ స్థానం రంగారెడ్డి, తృతీయ స్థానం హైదరాబాద్ ,అదిలాబాద్ జట్టులు నిలిచాయి..
మహిళల విభాగంలో ప్రథమ బహుమతి రంగారెడ్డి కైవసం చేసుకోగా.. ద్వితీయ స్థానంలో మహబూబ్ నగర్,తృతీయ స్థానంలో  నల్గొండ,హైదరాబాద్ నిలిచాయి..