– ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎంసీకేఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి, ముందుకు సాగాలని క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే క్రీడ మైదానం నుంచే ప్రారంభమవుతుందన్నారు. గెలుపొందిన జట్లకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి, తిరుమలగిరిసాగర్ ఎంపీపీ భగవాన్‌నాయక్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మెన్ కేవీ.రామారావు, తిరుమలగిరిసాగర్ వైస్‌ఎంపీపీ దిలీప్‌రెడ్డి, నందికొండ కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, రమావత్ మంగ్తనాయక్, నాగశిరీష మోహన్‌నాయక్, ఆదాసు నాగరాణి విక్రమ్, పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్యయాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు పుట్లూరి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజుయాదవ్, పంచకట్టు కృష్ణారెడ్డి, బుర్రి రాంరెడ్డి, యువనాయకుడు వినరురెడ్డి, శ్రీనివాస్‌నాయక్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.