
మండలంలోని దుర్గ నగర్ తండాలో టీఎస్ డబ్ల్యూ ఆర్డిసిడబ్ల్యూ నిజామాబాద్ ఎన్ఎస్ఎస్ యూనిట్ శీతాకాల ప్రత్యేక శిబిరం మంగళవారం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కే. లావణ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవ చేయడం విద్యార్థులకు లభించిన అదృష్టమని, ఈ గ్రామంలోని ప్రజలను ఉద్దేశించి ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రక్తదానం యొక్క ప్రాముఖ్యత, పచ్చదనము పరిశుభ్రత వలన కలిగే లాభాలు, ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, బాల్యవివాహాల నిర్మూలన గురించి చైతన్య పరిచారు. 13 సంవత్సరాల లోపు అమ్మాయిలను ఉద్దేశించి హెచ్పివి వ్యాక్సిన్ భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నివారణ కొరకు తప్పనిసరిగా తీసుకోవాలని, రక్తదానం గురించి, గ్రామస్తులను చైతన్యం చేయాలనీ సూచించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ గ్రామ ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైన అవగాహన కల్పించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారం రోజులపాటు గ్రామంలో జరిగే ఎన్ఎస్ఎస్ కార్యక్రమం వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నడిమెట్ల స్వాతి, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్ పద్మమ్మ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం. సరిత, అధ్యాపకులు డి. సుమలత, పి. శ్వేత, విడిసి మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.