చలికాలం పెదాల రక్షణ

Winter Lip Protectionచలికి పెదాలు పొడిగా మారి, చర్మం చీలి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. ఆ నొప్పి, మంట భరించలేనిది. పెదాలు పగల కుండా, పగిలినప్పుడు మృదువుగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
– స్నానం చేసిన తర్వాత పెదవులను శుభ్రం చేసి బాదం నూనెను రాసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. దాంతో రోజంతా పెదాలపై తేమ ఉండి పగలకుండా ఉంటాయి.
– కొబ్బరి నూనెను రోజుకు 2-3 సార్లు పెదవులపై రాయాలి. దీంతో పెదవుల నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
– పగిలిన పెదవులకు తేనెతో మర్దన చేయడం వల్ల మంట, నొప్పి వెంటనే తగ్గుతుంది.
– వెన్నలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు శరీర గాయాలకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఇందులోని అరాచిడోనిక్‌ యాసిడ్‌ పెదాలపై పగుళ్లను ఐదు, ఆరు గంటల్లో తగ్గిస్తాయి. పడుకునే ముందు వెన్న రాసుకుంటే ఉదయంకల్లా పగుళ్లు ఉండవు.
– కలబంద గుజ్జు రాసినా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసి పడుకుంటే ఉదయం వరకు పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది.
– కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని జ్యూస్‌ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌లో కాటన్‌ బాల్స్‌ ముంచి వాటితో పెదాలపై మర్దన చేయడం వల్ల పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
– చలికాలం ఎక్కువగా దాహం వేయదు. కానీ శరీరానికి కావాల్సినంత నీరు అందించాలి. ప్రతి గంటకు ఓ గ్లాసు నీరు తాగడం మంచిది. పెదవులు, శరీరం పగలకుండా ఉంటాయి.