
– ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జేల్లా సోమయ్య
నవతెలంగాణ-నెల్లికుదుర్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెల్ల సోమయ్య తెలిపారు. గురువారం హైదరాబాదులోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కు బోకే ఇచ్చి శాలతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రీతం కు రావడం తో ఎస్సీలలో ఉత్సాహం ఉందని పదవిని కట్టబెట్టిన పెద్దలకు కృతజ్ఞతలు అని అన్నారు. దీంతో దళితులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎంతో ఉందని తెలిపారు. పిఎసిఎస్ నెల్లికుదురు నుండి నిధులు తీసుకొచ్చి బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అధిక నిధులు మా ప్రాంతానికి కేటాయించి మా అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే పేదలు అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.