
– అలరిస్తున్నకబడ్డీ పోటీలు
నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని బట్టుగూడెం గ్రామం లో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రెండవ రోజు శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా జరిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్భంగా ఆయలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల రాకతో ఆలయం కిక్కిరిసింది. ఆలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవంలో భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్బంగా జరుగుతున్న కబడ్డి పోటీలు సాయత్రం ఆరు గంటలకు ఫ్లెడ్ లైట్ల వెలుతురులో అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. జాతరలో మండల ఆర్య వైష్యుల సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు, అర్య వైశ్య సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.