
నవతెలంగాణ మల్హర్ రావు
తెలుగు నూతన క్రోధి నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది ఉత్సవాలు పురస్కరించుకుని కాటారం మండలంలో ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా బాగుండాలని, అందరి గురించి మంచి పనులు చేయాలని, అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామని అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. భగవంతుని ఆశీస్సులు మంథని నియోజకవర్గం ప్రజల ప్రేమ, అభిమానంతో మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తరపున మంథని నియోజకవర్గ ప్రజలకు క్రోది నామ శుభాకాంక్షలు తెలిపారు.