భిన్న కాన్సెప్ట్‌తో..

different With the concept..సీనియర్‌ నటి జయలలిత సమర్ప కులుగా వ్యవహరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. ఏఆర్‌ కె విజువల్స్‌ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్‌ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్‌, విభీష, అలేఖ్య హీరో,హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22న స్క్రీన్‌ మాక్స్‌ సంస్థ ద్వారా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ‘జయలలితతో ‘పంచదార చిలక’ చిత్రంలో నటించాం. ఆమె చాలా మంచి వ్యక్తి. ఇందులో పాటలు బాగున్నాయి. ట్రైలర్‌ బాగుంది. అనిల్‌ బాగా చేశాడు. హీరోయిన్లు బాగా చేశారు. రాము ఎన్నో సీరియల్స్‌ చేశారు’ అని అన్నారు. ‘ఇల్లీగల్‌ రిలేషన్‌ వల్ల పిల్లలకు ఎదురయ్యే సమస్యల మీద, లవ్‌ అండ్‌ లస్ట్‌ మీద చిత్రాన్ని తీశాను’ అని డైరెక్టర్‌ రాము చెప్పారు. జయలలిత మాట్లాడుతూ, ‘ఈనెల 22న ఈ చిత్రం రాబోతోంది. ప్రేక్షక దేవుళ్లు మా సినిమాని చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.