పూర్తి రిఫండ్‌తో

With a full refund– హోటల్‌ బుకింగ్‌ రద్దు : క్లియర్‌ట్రిప్‌
న్యూఢిల్లీ : ముందుగా బుకింగ్‌ చేసుకున్న హోటల్‌ను కారణం లేకుండా ఎప్పుడైనా రద్దు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర ్‌ట్రిప్‌ తెలిపింది. వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా చెక్‌ ఇన్‌ చేయడానికి ముందు ఎప్పుడైనా వారి బుకింగ్‌లను రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొంది. ఒక్కో బుకింగ్‌కు రూ.25,000 వరకు పూర్తి రీఫండ్‌లను పొందవచ్చని క్లియర్‌ట్రిప్‌ సిఇఒ అయ్యప్పన్‌ ఆర్‌ పేర్కొన్నారు. ఇది తమ వినియోగదారులకు, 3 లక్షలకు పైగా హోటల్‌ భాగస్వాములకు బుకింగ్‌ అనుభవంలో కొత్త శకానికి నాంది పలికనుందని తెలిపారు.