వాస్తవ కథతో..

With real story..దర్శకుడు పాలిక్‌ తాజాగా బియస్‌ ఆర్‌ కె క్రియేషన్స్‌, రావుల రమేష్‌ క్రియేషన్స్‌, పాలిక్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం-2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. టి.రామసత్య నారాయణ స్క్రిప్ట్‌ అందచేయగా దర్శకుడు, నటుడు గూడ రామకష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రావుల రమేష్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటికే పాలిక్‌ దర్శకత్వంలో ‘రౌద్ర రూపాయ నమః’ చిత్రం నిర్మించాను. అక్టోబర్‌లో దీన్ని రిలీజ్‌ చేస్తాం. ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం ప్రారంభించాం’ అని అన్నారు. ‘ములుగు, వరంగల్‌, అరకు ప్రాంతాల్లో షూట్‌ ప్లాన్‌ చేశాం’ అని మరో నిర్మాత భోగి సుధాకర్‌ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథకు ఆధారంగా తెరకెక్కించే పీరియాడిక్‌ మూవీ. జాన్‌ భూషణ్‌ అద్భుతమైన ఆరు పాటలు అందించారు. దానికి సురేష్‌ గంగుల సాహిత్యాన్ని సమకూర్చారు. నాలుగు షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తాం’
అని తెలిపారు.