
నా రాజీనామా తోనే మునుగోడు నియోజకవర్గ అంతా 570 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలో గల బోడంగిపర్తి, తాస్కానీ గూడెం, శిర్ధ పల్లి, ఉడతల పల్లి, కోటయ్య గూడెం, పడమటి తాళ్ల, చామలపల్లి, గుండ్రపల్లి, చండూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిపిఐ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్న ఆరు గ్యారెంటీలను వివరిస్తూ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రైతుబంధు పెంపు, రైతు కూలీలకు 12000, కౌలు రైతులకు 15000 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుందని అన్నారు, రైతులకు ఏక సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని అన్నారు. ,2022 జరిగిన ఉప ఎన్నికల్లో, వంద మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లు వచ్చి నన్ను ఓడించడం జరిగిందన్నారు.ఈసారి కెసిఆర్ కు బుద్ధి చెప్పాలంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ చేయి గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక వ్యాధితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడంగిపర్తి నాయకులు సుజావుద్దీన్, షరీఫ్, తాస్కానిగూడెం సర్పంచ్, అప్పనబోయిన లింగయ్య, శిర్దపల్లీ సర్పంచ్, మా రెడ్డి. శ్రీదేవి నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఉడతలపల్లి మాజీ ఎంపిటిసి కావలి ఆంజనేయులు, ఉడతల పల్లి సర్పంచ్ కొరిమి అలివేలు ఓంకారం, పడమటి తల సర్పంచ్ మేకల వెంకన్న, చండూర్ మండల పార్టీ అధ్యక్షుడు కోడి గిరిబాబు, నాయకులు కోడి శ్రీనివాసులు, దో టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.