ఎమ్మెల్యే సహకారంతో మల్లన్న గుడి వద్ద విద్యుత్ ఏర్పాట్లు చేశాం

– టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు చిల్వేరి మల్లారెడ్డి…
నవతెలంగాణ-తొగుట
ఎమ్మెల్యే సహకారంతో మల్లన్న గుడి వద్ద విద్యుత్ ఏర్పాట్లు చేశామని టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ఆధ్యక్షుడు చిల్వేరి మల్లారెడ్డి అన్నారు. మండలం లోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామ సమీపంలో సింగ రాల మల్లన్న గుడి వద్ద గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంత్సరమం గుడి ప్రంగణం గ్రామస్థులు, నాయ కులు కలిసి అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్య కోసం స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలి సి సహకారం కోరామని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే 16 స్తంభాలు, వైరు అందించాలని అధి కారులను ఆదేశించారని తెలిపారు. కొద్ది రోజుల జాతర ఉత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా గుడి చుట్టూ, గుడి ముందట రెండు వైపులా రొడు పక్కన ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్తు సమస్య కోసం ఎమ్మెల్యేను అడగగానే స్పందించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నరు.