– కేటీఆర్ అడ్వొకేట్ మోహిత్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
న్యాయ సలహా మేరకు కేసును ఉపసంహరించుకున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అడ్వొకేట్ మోహిత్ రావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశముందని వివరించారు. అంతకుముందు ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1ఏ పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించినట్టు మోహిత్ రావు తెలిపారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన అంశాలని చెప్పారు.