లోకో పైలట్‌ లేకుండానే..

Without a loco pilot..– పట్టాలపై 80 కిలో మీటర్లు గూడ్స్‌ రైలు పరుగులు
చండీగఢ్‌: లోకో పైలట్‌ లేకుండానే ఒక గూడ్స్‌ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చూసి అంతా షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రైలు సిబ్బంది డ్యూటీ మారేందుకు జమ్ముకాశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో గూడ్స్‌ రైలును ఆపారు. హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం మరిచిన లోకో పైలట్‌, కో పైలట్‌ రైలు ఇంజిన్‌ నుంచి కిందకు దిగారు. అయితే పట్టాలు వాలుగా ఉండటంతో ఆ గూడ్స్‌ రైలు ముందుకు కదిలింది. కంకర, రైలు సామగ్రి వంటివి ఉన్న ఆ గూడ్స్‌ రైలు సుమారు వంద కిలోమీటర్ల వేగం అందుకుంది. జమ్ముకాశ్మీర్‌లోని కథువా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ మార్గంలోని ఐదు స్టేషన్ల మీదుగా అది ప్రయాణించింది.