రంగు మారకుండా!

రంగు మారకుండా!వంకాయ, యాపిల్‌ వంటివి కోసిన కొంతసేపటికే రంగు మారిపోతాయి. అలా కాకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. నీటి కొళాయిని తిప్పి వేగంగా వస్తున్న నీటి మధ్యలో యాపిల్‌ను ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్‌ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల కోసిన తర్వాత యాపిల్‌ ముక్కలు రంగు మారవు.
– అల్లంలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆక్సిడేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తుంది. కాబట్టి ఏవైనా పండ్లను కోసిన వెంటనే అల్లం ద్రావణంలో వేస్తే రంగు మారకుండా ఉంటాయి. వంకాయలను కోసేటప్పుడు ముక్కల్ని ఉప్పు కలిపిన నీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
– ఒక గాజు గ్లాస్‌లో నీళ్లు తీసుకుని అందులో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. అనంతరం అందులో పండ్ల ముక్కలు వేసి కలిపితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. నిమ్మరసం అందుబాటులో లేకపోతే పైనాపిల్‌ రసం, ఆరెంజ్‌ జ్యూస్‌ కూడా కలపవచ్చు.