మహిళ..?

మహిళ..?సూర్యోదయాస్తమాలకు
ఎదురీదే సాహసి ఆమె
మనకై మనకోసం
సర్వం ధారపోసే ధీర ఆమె
ముళ్ళబాటలో ఆమె
పూలబాసటగా మార్చేదీ ఆమే
బంధనాల విముక్తికై
నిత్యపోరాట శిఖరం ఆమె
అస్తిత్వ పరిరక్షణలో
నిత్య ప్రవాహిక ఆమె
ఆది శక్తి ఆమే
అంగడి సరుకూ ఆమే
మనువాద కుట్రకు బలిపశువు ఆమే
సనాతన తులనాత్మకత ఆమె
అతడి విజయం వెనుక ఆమే
అతడి బిడ్డల పరిచారిక ఆమే
అవనిలోనూ ఆమె
గగనసీమలోనూ ఆమె
ఆమె లేని చోటు ఎక్కడీ
అరగంటకోసారి అపహరణలోనూ ఆమే
అందరికీ కావాలి ఆమె
ఎవ్వరికీ పట్టనిదీ ఆమె
ఆమె అభివద్ధికి పథకాలు
అన్నీ నీటి మీది రాతలు
మారాలి ఆలోచన
రూపుమాయాలి లింగవివక్ష
ఆమె కావాలి స్వేచ్ఛా విహంగం
– మేరెడ్డి రేఖ, 7396125909